Movie Reviews

ఒక పల్లెటూరిలో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన లేడీస్ టైలర్ సుందరం కొడుకే గోపాలం (సుమంత్ అశ్విన్). గోపాలం కూడా తన తండ్రి వృత్తినే ఎంచుకొని జీవనం సాగిస్తుంటాడు. అయితే గోపాలం కు మన్మధ రేఖ ఉందని ఒక జ్యోతిష్యుడు చెప్తాడు. ఏ అమ్మాయిని ట్రై చేసినా వెంటనే పడిపోతుందని చెప్తాడు. గోపాలం కు ఒక కోరిక ఉండేది, ఎప్పటికైనా సిటీకి పోయి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంటుంటాడు. దాంతో తనకున్న మన్మధ రేఖను ఉపయోగించుకొని ఎవరినైనా బాగా డబ్బున్న అమ్మాయిని వలలో వేసుకొని తన కలను నెరవేర్చుకోవాలని అనుకొంటాడు. దాని కోసం ముగ్గురు అమ్మాయిలను ప్రేమలోకి దించుతాడు. ఇంతకీ గోపాలం ప్రేమాయణం ఎటువంటి పరిస్థుతులకు దారి తీస్తుంది. చివరికి గోపాలం ఆ ముగ్గిరిలో ఎవరితో కనెక్ట్ అవుతాడు అన్నదే కథ. ..    More


రేడియో జాకీ గా పని చేసే గౌతమ్ (రాజ్ తరుణ్) పుట్టుకతోనే అంధుడు. గౌతమ్ కంటి డాక్టర్ నేత్ర (హెబ్బా పటేల్) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఒకరి వల్ల గౌతమ్ కు కళ్ళు వస్తాయి. కానీ ఆ వ్యక్తి ఆత్మ గా వచ్చి గౌతమ్ ను ఇబ్బందులకు గురి చేస్తాడు. ఆ ఆత్మ వల్ల గౌతమ్ హత్యలు కూడా చేయాల్సి వస్తుంది. దాంతో డాక్టర్లని కలిసి తనకు కళ్ళు వద్దనీ, తీసేయమని కోరుతాడు. ఇంతకీ ఆ ఆత్మ గౌతమ్ చేత ఎందుకు హత్యలు చేయించింది? ఈ సమస్య నుంచి గౌతమ్ ఎలా బయటపడతాడు అన్నదే కథ. ..    More


చిన్నప్పట్నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె ఎప్పుడూ తన తండ్రి ఆది (సంపత్) మాటను జవదాటదు. ఒక పెళ్లి వేడుక కోసం వచ్చిన శివ (నాగ చైతన్య) అక్కడ భ్రమరాంబ ను చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత భ్రమరాంబ సిటీకి వచ్చి శివ చదివే కాలేజీ లోనే జాయిన్ అవుతుంది. అక్కడ వాళ్ళిద్దరి మద్య పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ భ్రమరాంబ తన తండ్రి చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకొంటాను అని శివ కు చెప్తుంది. ఇంతకు ముందే శివ తండ్రి జగపతి బాబు కు భ్రమరాంబ తండ్రి కి మధ్య పాత గొడవలుంటాయి. ఇంతకీ వారిద్దరి మధ్య ఉన్న గొడవలేంటి ? భ్రమరాంబ తండ్రి ని శివ తన పెళ్లి కి ఎలా ఒప్పించగలిగాడు అన్నదే కథ...    More


కేశవ(నిఖిల్) లా విద్యార్ధి. చిన్నప్పడు ఒక యాక్సిడెంట్లో తన తల్లి తండ్రులను పోగొట్టుకొంటాడు. దానికి కారణం పోలీసులు అని, కొంత మంది పోలీసులని టార్గెట్ చేసుకొని వాళ్ళను చంపుతుంటాడు. ఇలా హత్యలు చేస్తుండగా పోలీసులకు దొరికి పోతాడు. ఇంతకీ కేశవ వారిని ఎందుకు హత్య చేసాడు ? మిగతా వారిఫై ఎలా పగ తీర్చుకొన్నాడు అన్నదే కథ....    More


రాధా కృష్ణ (శర్వానంద్) కి తన చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఎలాగైనా పోలీస్ కావాలని కలలు కంటుంటాడు. క్రిమినల్స్ ను పట్టుకోవడంలో పోలీసులకు సహాయంగా ఉంటాడు. రాధా గడ్స్ ను చూసి ఒక పెద్ద ఆఫీసర్ అతనికి ఎస్ఐ గా ఉద్యోగం ఇప్పిస్తాడు. రాధా కు వరంగల్ దగ్గర ఒక పల్లెటూర్లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ రాధా (లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత రాధా కృష్ణ ని హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ సుజాత (రవికిషన్) అనే పొలిటీసియన్ తన రాజకీయ ఎదుగుదల కోసం అనేక కుట్రలు పన్నుతుంటాడు. ఈ కుట్ర లో కొంత మంది పోలీసులు కూడా చనిపోతారు. ఈ విషయం తెలుసుకొన్న రాధా ఎలా రియాక్ట్ అయ్యాడు ? సుజాత కుట్రలను ఎలా భగ్నం చేసాడు అన్నదే కథ...    More


మాధవ్ (అవసరాల శ్రీనివాస్) అనే కుర్రాడు యవ్వన దశలో సెక్స్ కు అడిక్ట్ అయ్యి ఎవ్వరు కనపడినా అదే దృష్టి తో చూస్తుంటాడు. ఈ క్రమంలో మాధవ్ అనేక మంది స్రీ లతో సంబంధాలు పెట్టుకొంటాడు. తన ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సెటిల్ అయినా మాధవ్ మాత్రం కొత్త, కొత్త అమ్మాయిలతో రిలేషన్ మైంటైన్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఎదురైన ఒక ఇబ్బంది వల్ల, ఇక పెళ్ళిచేసుకొని వీటికి పుల్ స్టాప్ పెట్టాలనుకొంటాడు. ఈ క్రమంలో మూడు పెళ్ళిచూపులకు వెళ్లి అక్కడ అమ్మాయిలకు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం తో మాధవ్ ను పెళ్ళిచేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. చివరగా రాధ (మిస్తి చక్రబర్తి) అనే అమ్మాయికి తాను ఫుల్ క్లీన్ అని చెప్పి దగ్గరవుతాడు. ఇంతకీ మాధవ్ రాధ ను పెళ్ళి చేసుకోకలుగుతాడ ? ఇంతకీ తనకున్న చెడు అలవాటును మానుకొంటాడా లేదా అన్నదే కథ...    More


బాహుబలి పార్ట్ వన్ లో బాహుబలి ని చంపింది నేనే అని రాజమౌళి కట్టప్పతో చెప్పిచ్చి, ప్రేక్షకులను టెన్షన్ లో పెట్టాడు. బాహుబలి 2 సినిమా మొదలవగానే శివగామి(రమ్య కృష్ణ) అమరేంద్ర బాహుబలికి పట్టాభిషేకం చేయాలనుకొంటుంది. అందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తుంది. ఈ గ్యాప్ లో అమరేంద్ర బాహుబలి దేశ పర్యటనలు చేస్తాడు. ఆ పర్యటనలో భాగంగా కుంతల రాజ్యానికి చేరుకొని, అక్కడ ఆ దేశపు యువరాణి దేవసేన (అనుష్క) తో ప్రేమలో పడతాడు. మరో వైపు బాహుబలి ని రాజు కానివ్వకుండ ఎలాగైనా తనే రాజు కావాలని భల్లాలదేవుడు ఒక కుట్ర పన్నుతాడు. ఆ కుట్ర లో...    More


ముగ్గురు ఫ్రెండ్స్ సినిమాలో ఛాన్సుల కోసం ఒక షార్ట్ ఫిలిం తీయాలనుకొంటారు. ఆ షార్ట్ ఫిలింలో నటించడానికి ప్రముఖ మలయాళ హీరోయిన్ స్వాతి (ఐనా సాహా) ని ఒప్పిస్తారు. ఆ సినిమా షూటింగ్ కోసం ఊరి బయట పాతబడిన ఒక బంగ్లా ను ఎంచుకొంటారు. దానికి ఓనర్ అయిన రెబెక్కా టెలీపతి (అవతలి వ్యక్తుల మనసుల్లో ఏముందో తెలుసుకోవడం) లో నేర్పరి. రెబెక్కా (రాశి) వల్ల వీళ్ళంతా కష్టాలు ఎదుర్కొంటారు. కొన్ని రోజుల తర్వాత స్వాతి కనిపించకుండా పోతుంది. దానికి కారణం రెబెక్కా నే అని అందరూ భావిస్తారు. ఇంతకీ స్వాతి ఎక్కడకు పోయినట్లు? ఇంతకీ ఈ కొత్త టెలీపతి విద్య ఏమిటన్నదే కథ...    More


ఒక ట్రైన్ లో రహీం (శక్తి), గుడ్డివాడు ఇద్దరు మాత్రమే ఉంటారు. గుడ్డివాడు రహీం ను ట్రైన్ లో నుంచి తోసేస్తాడు. కాని దాన్ని పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు. కాని రహీం ప్రేయసి సంగీత కు హత్యగా అనుమానం ఉంటుంది. దాంతో తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ని సంప్రదిస్తుంది. ఈ కేసు ను సీక్రెట్ గా ఒక సిబిసిఐడి ఆఫీసర్ శివలింగ (లారెన్స్) కు అప్పగిస్తారు. ఇదిలా ఉండగా శివలింగ కు ఇంట్లో వాళ్ళు సత్య (రితికా సింగ్) ని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ కేసు చేదిస్తుండగా సత్య వింతగా ప్రవర్తిస్తుంది. ఆమె ను ఒక ఆత్మ ఆవహించిందని శివలింగ తెలుసుకొంటాడు. ఇంతకీ సత్య ను ఆవహించింది ఎవరు? శివలింగ టేక్ అప్ చేసిన కేసులో హంతకుడు ఎవరు అన్నదే కథ.    More


స్పెయిన్ లో తన తల్లితండ్రులతో కలిసి ఉంటున్న చై (వరుణ్ తేజ) కి ఇండియా నుంచి వచ్చిన మీరా (హెబ్బా పటేల్) తో పరిచయం ఏర్పడి ఆమెను ప్రేమిస్తాడు. చై తన ప్రేమను ప్రపోజ్ చేయాలనుకొనే సమయంలో మీరా తను ఇండియా లో ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఇండియా వెళ్ళిపోతుంది. ఒక రోజు మీరా ఫోన్ చేసి తాను కష్టాల్లో ఉన్నానని తమ ప్రేమకు హెల్ప్ చేయమని చై ని అడుగుతుంది. దాంతో మీరా కు హెల్ప్ చేయడానికి ఇండియా వెళ్లిన చై కి అక్కడ చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) పరిచయవుతుంది. చంద్రముఖి చై ని ప్రేమిస్తుంది. చంద్రముఖి వల్ల చై మరో సమస్యలో ఇరుక్కొంటాడు. ఇంతకీ ఆ సమస్య ఏంటి? చంద్రముఖి కి చై ప్రేమ దక్కుతుందా అన్నదే కథ...    More


Back To Top