ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్న “జవాన్”

jawan telugu movie,jawan movie cast,herione mohrin,director bvs

బీవీయస్ రవి దర్శకత్వంలో “జవాన్” సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సాయిధరం తేజ్ హీరోగా , మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ చాలా చక్కటి కాన్సెప్ట్ తో మేం తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. సాయిధరం తేజ్ ఇప్పటి వరకూ చేయని ఓ మంచి పాత్రలో నటిస్తున్నాడు.

మధ్య తరగతికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి? వాటిని తన బుద్ధి బలంతో ఎలా కాపాడుకున్నాడనిదే ఈ సినిమా కథ. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనర్ అని దర్శకుడు బీవీయస్ రవి చెప్పారు. కృష్ణ మాట్లాడుతూ రవి చెప్పిన కథను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం. జులైలో మిగిలిన షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తాము అని చెప్పారు. దిల్ రాజు మాట్లాడుతూ తేజ్ కథలో ఇన్వాల్స్ అయ్యి మరీ చేస్తున్నాడు. సినిమా అనుకున్నట్లుగా బాగా వస్తుంది అని చెప్పారు.

Back To Top