దసరా సీజన్ లో వస్తున్న “జై లవకుశ”

jai lava kusha telugu movie,jai lava kusha movie cast,director ks ravindra,jai lava kusha movie review

ఎన్టీఆర్ తొలిసారి మూడు పత్రాలు పోషిస్తున్న జై లవకుశ సినిమా దసరా సీజన్ లో విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీ నవరాత్రులు ప్రారంభయ్యే సెప్టెంబర్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాత, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ అధినేత నందమూరి కళ్యాణ్ రామ్ తెలిపారు.

సెప్టెంబర్ 30న దసరా పండగ. అంటే దసరా సెలవుల ద్వారా పూర్తి ప్రయోజనం పొందాలని నిర్మాత ఆలోచిస్తున్నాడు. జులై తొలివారంలో ఈ సినిమా టీజర్ ను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రల్లో ఒక దానికి నెగిటివ్ షేడ్స్ ఉంటాయనీ, ఈ పాత్రను తారక్ సవాలుగా తీసుకొని చేస్తున్నారనీ యూనిట్ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను అక్కట్టుకుంది. హిందీలో “గుడ్డూ రంగీలా”, “కాబిల్” సినిమాల్లో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న రోణిత్ రాయ్ ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్, రోణిత్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ నెలాఖరి వరకు ఈ షెడ్యుల్ జరగనుంది.

Back To Top