సురేష్ గోవింద్ దర్శకత్వంలో వస్తున్న “టీమ్-5”

team 5 telugu movie,team 5 movie cast,hero sreesanth,herione nicky galrani

సురేష్ గోవింద్ దర్శకత్వంలో “టీమ్-5” సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీశాంత్ హీరోగా నటిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగాడు శ్రీశాంత్. ఇప్పుడు వెండి తెరపై తన ప్రతిభ చూపించడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాలో నిక్కీ గల్రానీ, పెరల్ మానే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మకరంద్ దేశ్ పాండే ఓ కీలక పాత్రలో నటిస్తునాడు.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇదో బైక్ రేసర్ కథ. ఇలాంటి నేపథ్యంలో దక్షిణాదిన ఓ చిత్రం రావడం ఇదే ప్రథమం. రేసింగ్ ఒక్కటే కాదు. అన్ని కమర్షియల్ హంగులూ ఉంటాయి. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించాడు ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అన్నారు.

Back To Top