నా జీవితం పూర్తిగా నా చేతుల్లోనే ఉంది అంటున్న శ్రుతి హాసన్

shruti haasan telugu movie,shruti haasan movie cast,shruti haasan movie news

మొదట్లో అలవాట్లు సాలెగూళ్లు- ఆ తర్వాత ఇనుప సంకెళ్లు అని పెద్దలు అంటుంటారు. ఏదైనా సరే, సరదాగా మొదలువుతుంది, వ్యసనంగా మారిపోతుంది. మనుషుల బలహీనతే వ్యసనానికి తొలిమెట్టు. అయితే శ్రుతి హాసన్ నాకేదీ వ్యసనం కాదు అని శ్రుతి హాసన్ అంటోంది. నా జీవితం పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. నాకూ కొన్ని అలవాట్లున్నాయి.

కానీ వాటికెప్పుడు లొంగిపోను. పోతే నేను లేను అనే మాటలు నా నుంచి వినిపించవు. ఎందుకంటే సినిమా నాకో ఫ్యాషన్. చాలా ఇష్టంగా చేస్తున్న పని. ఓ రకంగా హాబీ. షూటింగ్ లు లేని రోజు నేనేం బలహీన పడిపోను. దిగాలుగా కుర్చోను. ఎందుకంటే ఆ క్షణాల్ని ఎలా గడపాలో నాకు తెలుసు. చేతి నిండా పని పెట్టుకోవడం, వివిధ రంగాల్లో ప్రవేశం ఉండడం నా బలాలు. అందుకే ఏ క్షణం వృథాగా పోనివ్వను అని శ్రుతి హాసన్ చెబుతుంది.

Back To Top