పక్కా ప్లానింగ్ తో వస్తోన్న మెగా హీరోలు

mega heroes,mega heroes telugu movie,mega heroes movie cast,hero pavan kalayan

సినిమాల విడుదల విషయంలో మెగా హీరోలు ఎప్పుడు జాగ్రత్త పడుతుంటారు. పోటీ అన్న పదానికి ఎప్పుడు దూరంగా ఉండాలనుకుంటారు. రెండు సినిమాలు ఒకేసారి వస్తే గండి పడుతుంది అని సింగిల్ గా రావడానికే ప్రయత్నిస్తుంటారు. బన్నీ ఇప్పుడు “డిజే “ సినిమాతో అదే చేస్తున్నాడు. “డిజే” సినిమాకు టాక్ కాస్త అటూ, ఇటూ ఉన్న సినిమా వసూళ్ళ ను అందుకుంటుందంటే దీనికి కారణం మరో సినిమా పోటీ లేకపోవడమే. “బాహుబలి 2” సినిమా తర్వాత పెద్ద సినిమా రాలేదు.

అలాంటి టైమ్ లో పక్కా ప్లానింగ్ తో “డిజే” సినిమా వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు. పవన్ త్రివిక్రమ్ సినిమాను దసరా కు తీసుకురావాలని ప్లాన్ చేశాడు. కానీ దసరా బరిలో బాలయ్య, ఎన్టీఆర్ ఉన్నారు. పైగా పవన్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. దీనితో పవన్ కళ్యాణ్ దీపావళికి సోలో గా వస్తున్నాడు. పవన్ దారిలోనే సాయిధరం తేజ్ కూడా వెల్తునాడు. సాయిధరం తేజ్ నటిస్తున్న “జవాన్” సినిమా సెప్టెంబర్ కు విడుదల కానుంది. ముందు ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఆరోజు నితిన్ “లై” సినిమాతో, బెల్లంకొండ “జయ జానకి నాయక” సినిమాలు ఉండడం తో పోటీ ఎందుకని సెప్టెంబర్ లో సోలోగా వస్తున్నాడు. రామ్ చరణ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. చరణ్ కెరీర్ మొదట్లో తన సినిమాలు సెలవుల్లో, సమ్మర్ లో వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు దసరాకు రావాల్సిన “రంగస్థలం” కూడా సంక్రాంతికి వెళ్ళిపోయింది. దసరాకి ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ బాబు తో పోటీ పడాలి. సంక్రాంతికి మహేష్ బాబు ఒక్కటే వస్తాడు. ఇలా మెగా హీరోలంతా తమ సినిమా విడుదల విషయంలో పక్కా ప్లానింగ్ ఫాలో అవుతున్నారు.

Back To Top