ప్రస్తుతం కెరీర్ పై దృష్టి అంటున్న నయనతార, విఘ్నేష్

nayanatara telugu movie,nayanatara movie cast,nayanatara new movie,director vignesh shivan

ప్రేమ, పెళ్లి జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు. కానీ నయనతారకు ఇవి రెండూ చేదు జ్ఞాపకాలుగా కొందరు మార్చేస్తున్నారు. అసలు జీవితంలో పెళ్లి మాట వింటేనే కోపం వచ్చేలాగ గాసిప్ రాయిల్లు చేస్తున్నారు. నయనతార పర్సనల్ జీవితాన్ని రచ్చకు ఈడిస్తూ రోజుకీ ఒక రూమర్ తో నయనతారను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా నయనతార పెళ్లిపై మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుదేవ, శింబు ప్రేమ వ్యవహారం తర్వాత ప్రేమ, గీమ వదిలిపెట్టి బుద్దిగా కెరీర్ పై దృష్టి పెట్టింది.

నయనతార వరుస సినిమాలతో తమిళనాడులో టాప్ హీరోయిన్ అయిపోయింది. కానీ ప్రేమకు బాగా అలవాటు పడిన నయనతార ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత రెండేళ్ళు విడిగా ఉంది. మళ్ళీ నయనతార గత ఏడాదిన్నరగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. మొదట్లో వీళ్ళు స్నేహితులమే అని చెప్పిన వాళ్ళ తీరు మాత్రం అంతకు మించే ఉంది. ఏ ఫంక్షన్ కి అయిన వీరిద్దరు కలిసే వస్తున్నారు. కానీ విఘ్నేష్ మాత్రం తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే ఉందన్నాడు. నయనతార నుండి కూడా ఇదే సమాధానం వస్తుంది. దీనితో తమిళనాడులో నయనతార పెళ్లి హాట్ టాపిక్ గా మారిపోయింది.

Back To Top