జర్నలిస్ట్ పాత్రలో శ్రద్దాదాస్

shraddha das telugu movie,shraddha das movie cast,shraddha das as a journalist

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “పిఎస్ వి గరుడవేగ” సినిమా తెరకెక్కుతుంది. 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్దా దాస్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. ప్రవీణ్ సత్తార్ గత చిత్రం గుంటూరు టాకీస్ లో గ్యాంగ్ స్టార్ గా నటించింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని శ్రద్దా రోల్ ను పాత బస్తీలో చిత్రీకరిస్తున్నారు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా “గరుడవేగ“ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ఎన్.ఐ.ఎ ఆఫీసర్ గా రాజశేఖర్ నటిస్తున్నాడు. పూజా కుమారి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కిషోర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సన్నిలియోని సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి.

Back To Top