రికార్డు స్థాయిలో రూ.3 కోట్లు పలికిన మధూరి లెహంగా

madhuri dixit telugu movie,madhuri dixit movie cast,madhuri dixit movie news

అభిమానులకు సినీ తారలంటే ఎంత క్రేజో సినిమాల్లో వారు వేసుకునే డ్రెస్సులంటే అంతకు మించిన మోజు ఉంటుంది. తారలు వాడిన ఆ దుస్తులను వేలంలో చేజిక్కించుకునే అవకాశం వస్తే ఎంత ధర చెల్లించడానికైనా వెనకాడరు. దీనికి మాధురీ దీక్షత్ మీద తెరకెక్కించిన మార్ డాలా అనే పాట సూపర్ హిట్ అయ్యింది.

అందులో మాధురీ ధరించిన ఆకుపచ్చ లెహంగా కూడా అదే స్థాయిలో జనం దృష్టిని ఆకర్షిచింది. ప్రముఖ కాస్ట్యుమ్ డిజైనర్ నీతాలుల్లా డిజైన్ చేసిన ఆ లెహంగా కోసం ప్రేక్షకుల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో చిత్రబృందం సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత దాన్ని వేలం వేసింది. రికార్డు స్థాయిలో అది రూ.3 కోట్లు పలికింది. ఇప్పటి వరకూ బాలీవుడ్ తారల దుస్తుల వేలానికి సంబంధించి ఇదే అత్యధిక ధర కావడం విశేషం.

Back To Top