మా పిల్లలు సినిమా తారలు కాదు. సినిమా తారల పిల్లలంతే అంటున్న షారుఖ్ ఖాన్

shahrukh khan,shahrukh khan telugu movie,shahrukh khan movie cast,shahrukh khan movie review

సినిమా తారలే కాదు వాళ్ళ పిల్లలూ సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యను తీసుకొని కేన్స్ కు వెళ్లినప్పుడు కూతురు కూడా సెలబ్రిటీలా మెరిసిపోయింది. షారుఖ్ ఖాన్ తనయుడు అబ్రామ్ కు దక్కిన పాపులారిటీ కూడా ఎక్కువే. ఇలా తారలతో పాటు వాళ్లు పిల్లలు కనిపించగానే ఫోటో క్లిక్ ల వర్షం కురుస్తోంది. మీడియాతో తనకు సౌకార్యంగానే ఉన్నా తన పిల్లలు ఇబ్బంది పడతారంటున్నాడు షారుఖ్ ఖాన్ అంటున్నాడు.

ఈద్ సందర్భంగా ముంబైలో వేలకరులతో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ మా పిల్లలు సినిమా తారలు కాదు. సినిమా తారల పిల్లలంతే. వాళ్ళు నాతో పాటు కనిపించినా నేను మీడియాతో మెలిగినట్టు వాళ్లు ఉండలేరు. ఇబ్బందిగానే ఉంటారు. సినిమా తారలు కావాలనే ఉద్దేశ్యంతో వాళ్లు పబ్లిక్ లోకి రావడం లేదని చెప్పారు. షారుఖ్ కూతురు సుహానా త్వరలోనే సినిమాల్లోకి వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి షారుఖ్ మాట్లాడుతూ మా ఇంట్లో వాళ్లు ఎవరైనా కనీసం డిగ్రీ పూర్తి చేయాలనేదే ఓ నియమం. ఆ లెక్కన చూసుకుంటే సుహానా చదువు పూర్తి కావాలంటే ఇంకో నాలుగేళ్ళు పడుతుంది. నేను డిల్లీ నుండి ముంబై కు ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చాను. చదువు పూర్తి అయ్యాక నా పిల్లలు అలానే వస్తారని భావిస్తున్నా అని షారుఖ్ ఖాన్ చెప్పారు.

Back To Top