అవకశాల కంటే అభిరుచికి ప్రాధాన్యమిస్తా అంటున్న కాజల్

kajol agarawal,kajol agarawal  telugu movie,kajol agarawal  movie cast,kajol agarawal  movie news

కాజల్ యాబై సినిమాల మైలురాయిని చేరుకుంది. కానీ ఆమె తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని చెబుతోంది. అదెలా అని అడిగితే నటనని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్న సమయమిదే. అందుకే నా ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టుందని చెప్పింది. హీరోయిన్లు తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా పాత్రల్ని ఎంపిక చేసుకునే వెసలుబాటు ఎప్పుడో కానీ రాదు. అదిప్పుడు నాకొచ్చింది. ఆరంభంలో నేను కూడా అందరిలాగే వచ్చిన ఆవకాశాల్ని సద్వినియోగం చేసుకొందామనే ప్రయత్నించా.

కానీ ఇప్పుడిప్పుడే అవకశాల కంటే అభిరుచికి ప్రాధాన్యమిస్తూ ప్రయాణం చేస్తున్నా. అయితే తెరపై నేను ఎలాంటి పాత్రలో కనిపించినా అది ణా కుటుంబంతో కలిసి చూసేలా ఉండాలన్నదే నా నియమం. దాన్ని చివరి వరకు పాటిస్తా అని కాజల్ అంటోంది. తెరపై అందంగా కనిపించడంలో తనకు తానే సాటి అనిపించుకునే కాజల్ కు కామెడీ కథల్లో నటించడమే ఇష్టమంటోది. గ్లామర్ పరంగా, నటన పరంగా ప్రాధ్యానమున్న పాత్రలు చాలానే చేశా. కానీ నవ్వించడంలో ఉన్నంత కిక్ మరెక్కడా దొరకలేదు. చేయడంలోనే కాదు. చూడడానికి కూడా కామెడీ సినిమాలంటేనే ఇష్టం అని కాజల్ చెబుతోంది. ప్రస్తుతం కాజల్ “నేనే రాజు నేనే మంత్రి”, ఎమ్.ఎల్.ఎ సినిమాల్లో నటిస్తోంది.

Back To Top